తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ రాజకీయ ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావు ఇవాళ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల దర్శన అభ్యర్థనల కోసం వారానికి రెండు రోజులు సిఫార్సు లేఖలను స్వీకరించడానికి టీటీడీ అంగీకరించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండించారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.