చిత్తూరు జిల్లాలో విషాదం

78చూసినవారు
చిత్తూరు జిల్లాలో విషాదం
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బూరుగమాకులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిన్న పొలం నుంచి ఇంటికెళ్తుండగా సిద్ధార్థ (4) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం నీటి కుంటలో సిద్ధార్థ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాలుడి మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్