వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

69చూసినవారు
వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 25 వరకు వంశీ రిమాండ్ గడువును పొడిగిస్తూ, న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్ పై న్యాయస్థానం విచారించింది. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్