అక్షర్ పటేల్, రిషభ్ పంత్ కెప్టెన్సీ ఒకేలా ఉంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడగాడు అభిషేక్ పోరెల్ పేర్కొన్నారు. రిషభ్ పంత్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయరని.. అతడిని తాము మిస్ అవుతున్నట్లు పోరెల్ తెలిపారు. అక్షర్ కెప్టెన్సీలో ఈ సారి IPL టైటిల్ గెలవడంపైనే తమ దృష్టంతా ఉందని పోరెల్ వెల్లడించారు. పంత్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకోకపోవడంతో లక్నో జట్టు అతడిని రూ.27 కోట్లకి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.