AP: స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం (65) గుండెపోటుతో చనిపోయారు. కొడుకుకు ‘ఖేల్‌రత్న’ అవార్డు ప్రదానోత్సవం చూసి మురిపోవాలనుకున్న తండ్రి కన్నుమూశారు. ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం కోసం గురువారం అమలాపురం నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా.. ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. కాగా, 2023లో సాత్విక్ ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. కానీ పలు కారణాలతో అప్పుడు అవార్డును తీసుకోలేదు.