AP: ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను, సరుకులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చిన్నారులు సీఎం చంద్రబాబుని మీ స్కూల్ డేస్ లో ఇష్టమైన సబెక్టు ఏది అడగగా.. దానికి సీఎం సమాధానమిస్తూ.. సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అంటే ఇష్టమన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.