ప్రతి రోజూ జొన్న రొట్టెలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జొన్న రొట్టెలను తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.