IPL-2025లో భాగంగా చండీగఢ్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 28 సార్లు తలపడ్డాయి. కాగా, వీటిలో రాజస్థాన్ రాయల్స్ 16 మ్యాచ్‌ల్లో గెలిచి పైచేయి సాధించింది. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.