ప్రయాణికులకు మరింత సేవలందించేందుకు ఎస్. కోట నుండి విశాఖకు అల్ట్రా పల్లె వెలుగు బస్సును స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఎస్. కోట నుంచి ప్రతిరోజూ ఉదయం విశాఖకు 7. 45, 11. 30, 15. 20, తిరుగు ప్రయాణంలో ఎస్. కోటకు 9. 45, 13. 35, 17. 15 అందుబాటులో ఉంటుందని ఎస్. కోట డిపో మేనేజర్ కే. రమేష్ తెలిపారు.