రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో గల 15వ వార్డులో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ, చంద్రశేఖర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.