ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా మీడియా కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ సోమవారం చీపురుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వృద్ధులకు, వితంతువులకు, డప్పు కళాకారులకు ఇతర లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.