చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి జరగాలని రాష్ట్ర మాజీ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శనివారం చీపురుపల్లిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రతి ఒక్కరు ప్రజలకు అధికారులు సహకరించాలన్నారు. అభివృద్ధి పనులపై సమీక్షించుకొని వాటిని పరిష్కరించే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లిక నాయుడు బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు.