ఘనంగా పౌష్టికాహార మసోత్సవాలు

58చూసినవారు
పాత బగ్గాo అంగన్వాడి కేంద్రం-1 లో పౌష్టికాహార మసోత్సవాలుల్లో భాగంగా.. మంగళవారం స్టాల్స్‌ నిర్వహించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను గురించి వివరించారు. గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవలసిన ఆహార పదార్థాలను వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత వివరించారు. సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్ శకుంతల, సర్పంచ్ పద్మ, గురు నాయుడు, టీచర్ శారద పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్