పార్వతీపురాన్ని స్వచ్ఛ సుందరంగా తీర్చిదిద్దాం: కలెక్టర్
స్వచ్ఛ సుందరంగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సుందర పార్వతీపురంపై ఆదివారం జిల్లా అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతకు మారుపేరుగా పార్వతీపురం నిలవాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తలను వేరుచేసి, చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.