పార్వతీపురం పట్టణ సిపిఎం కమిటీ కార్యదర్శిగా గొర్ల వెంకటరమణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో మూడవ పట్టణ మహాసభలో జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా కమిటీ సభ్యులు వి.ఇందిర, యమ్మల మన్మధరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో కార్యదర్శితో పాటు ఆర్ శ్రీదేవి, పాకాల సన్యాసిరావు, ఎస్ ఉమామహేశ్వరరావు, పడాల రాజశేఖర్, బొత్స లక్ష్మి, ఎం వెంకటరమణ, కే.భగత్ లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.