విజయనగరం: స్పీడ్ బ్రేకర్స్ వేయండి.. ప్రమాదాలను నివారించండి
విజయనగరం స్థానిక 42 డివిజన్ పరిధిలో ఉన్న కామాక్షి నగర్ శ్రీచైతన్య స్కూల్ వద్ద, అయ్యన్నపేట జంక్షన్ వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తక్షణమే స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ప్రజా వినతులు పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కు వినతిపత్రం అందజేశారు.