ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రవాణా, క్రీడా, యువజన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఎ. పి. యస్. ఆర్. టి. సి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షుడు ముత్యాలరావు మాట్లాడారు.