రామభద్రపురం మండలం ఆరికతోట సమీపంలో న్యూ బజరంగీ పేరుతో నిర్వహిస్తున్న రాజస్థానీ దాబాలో పనిచేస్తున్న వ్యక్తి నుంచి 78 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్టు రామభద్రపురం ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు నల్లమందును సరఫరా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. బోటా అనే ప్రాంతం నుంచి తీసుకొస్తున్నట్లు గుర్తించామన్నారు.