మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 11వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పామోటి చిన్నంనాయుడు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన లాటరీ విజయనగరంలో ఉంటుందని చెప్పారు. బొబ్బిలి సర్కిల్ పరిధిలో 23 దుకాణాల నుంచి 552 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.