పంట పొలాల్లో పురుగు నాశనానికి వేప కషాయం మెరుగైన ఫలితాలు ఇస్తుందని రామభద్రపురం వ్యవసాయ శాఖాధికారి శర్మ తెలిపారు. నాయుడు వలసలో రైతు సేవ కేంద్రం వద్ద వేపగింజల కషాయం తయారీ విదానాన్ని వివరించారు. ఒక ఎకరా పొలానికి 10 కిలోల వేప గింజలు, 200 గ్రాముల సబ్బు పొడి, 200 లీటర్ల నీరు మిశ్రమం చేసి, పంట తెగుళ్ళు, పురుగులు పై పిచికారీ చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చునన్నారు. దీని వలన ఖర్చు తగ్గుతుందన్నారు.