రామభద్రపురం మండలంలోని నేరెల్లవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెల్లూరు పోలయ్య ఆదివారం పదవి విరమణ చేశారు. 33 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా విశేష సేవలు అందించిన పోలయ్య పదవి విరమణ చేయడంతో పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణారావు, సోములు, సతీష్, మంజుల, సురేష్ అలాగే ఇతర సిబ్బంది దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.