స్థానిక పరిపాలన కోసమే పంచాయతీరాజ్ వ్యవస్థ

1250చూసినవారు
స్థానిక పరిపాలన కోసమే పంచాయతీరాజ్ వ్యవస్థ
బొబ్బిలికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త తుమరాడ గంగాధర్ ఆదివారం రోజున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రకటణ విడుదల చేశారు. అందులో బాగంగా ప్రధానంగా భారతదేశంలో స్వాతంత్రం అనంతరం ప్రజా శ్రేయస్సు, సమాజ సంక్షేమమే లక్ష్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణ చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రాంతీయ స్థాయిలో స్థానిక స్వపరిపాలన కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకల్పన జరిగిందని అన్నారు.

73వ రాజ్యాంగ సవరణ చట్టం -1992 ప్రకారంగా పంచాయితీరాజ్ వ్యవస్ధ కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడం జరిగిందని ఫలితంగా 1993 ఏప్రిల్ 24న అమలులోకి వచ్చింది కాబట్టి ఈ రోజున పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. అలానే మొదటిసారిగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో 1989లో పార్లమెంట్లో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టినప్పటికీ అది విఫలం కావడంతో చివరగా పీవీ నరసింహరావు,ప్రధానమంత్రిగా ఆయన నేతృత్వంలో ఈ పంచాయతీ రాజ్ బిల్లు విజయవంతం అయిందని ఫలితంగా గ్రామ పంచాయితీలు ఏర్పడ్డాయని అన్నారు.

అలానే భారత రాజ్యాంగంలోని అధికరణ 40, 11వ షెడ్యూల్ లో కూడా 29 అంశాలతో కూడిన పంచాయతీల అధికార పరిధిని తెలియజేస్తున్నాయన్నారు. వాటిలో ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ పనులు, పశువుల సంరక్షణ పాల ఉత్పత్తులు, కోళ్ల పరిశ్రమ, గ్రామీణ విద్యుదీకరణ, విద్యుత్ పంపిణీ గ్రంధాలయాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, పరిసరాల పరిశుభ్రత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు, సామాజిక సంక్షేమం, వికలాంగులకు చేయూత, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటి అంశాలు తెలియజేస్తున్నాయనని అన్నారు. అలానే జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, జివికె రావ్ లాంటి కమిటీలు ఏర్పాటు చేసి పంచాయితీరాజ్ వ్యవస్ధ పనితీరును పరీశీలించి తగిన సిఫార్సులను చేశాయని గంగాధర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్