జనసేన పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త గిరిడ అప్పలస్వామి హెచ్చరించారు. కార్యకర్తలు, నాయకులతో ఆదివారం బొబ్బిలిలో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేతో చర్చించిన తరువాత నిర్ణయం ఉంటుందని అప్పలస్వామి తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు.