చీపురుపల్లి: గత ఐదేళ్లుగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది

52చూసినవారు
చీపురుపల్లి: గత ఐదేళ్లుగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడింది
గత ఐదేళ్లుగా పంచాయతీల్లో వైసిపి ప్రభుత్వం కారణంగా అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన చంపావతి నది సమీపంలో గల మంచినీటి పథకాన్ని పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులను దారి మల్లించడం కారణంగా పారిశుద్ధ్యం పడకేసిందని, తద్వారా గుర్లలో డయేరియా ప్రబలడానికి కారణమైందని ఆరోపించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్