రైతులు నూతన వ్యవసాయ విధానాలు తెలుసుకోవాలని గ్రామ సర్పంచ్ బి. సన్యాసమ్మ అన్నారు. మంగళవారం చీపురుపల్లి నియోజకవర్గం గరికివలస గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులకు పంట పండించే విధానం, ఎరువులు వేసే పద్ధతులు, దిగుబడి మార్గాలు గురించి తెలుపుతూ అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి మంచిదని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కలిగి వుండాలని తెలిపారు.