చీపురుపల్లి ఆశయ యూత్ అసోషియేషన్ మరియు మెట్టపల్లి నవభారత్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఆంగ్ల నామ నూతన సంవత్సర సందర్భంగా.. బస్టాండు ఆలయాల వద్ద ఉన్న వారికి ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు నిరాశ్రయులు, బాటసారులకు 25 మందికి శుక్రవారం రాత్రి అల్పాహారం ప్యాకెట్లు అందించి వారి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా కేకులకు బదులు పేదవారికి సేవా కార్యక్రమాలు చేయాలని లక్ష్యంతో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే సమాజంలో ప్రతిఒక్కరూ సేవా భావాలను అలవర్చుకోవాలని, పుట్టినరోజు, జయంతి వేడుకలు చేసుకున్న వారు పేదవారికి అకలి తిర్చడానికి ముందుకు రావాలని, తద్వారా సేవా కార్యక్రమాలకు చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవభారత్ యువజన సంఘం అధ్యక్షలు హరి, రాంబాబు మరియు సభ్యులు చిన్న పాల్గొన్నారు.