ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న విశాఖలో మాలల గర్జన నిర్వహిస్తున్నట్లు చీపురుపల్లి నియోజకవర్గం కన్వీనర్ టీ. సంజీవరావు తెలియజేశారు. ఈ మేరకు శనివారం గరివిడి ప్రెస్ క్లబ్ ఆవరణలో గోడపత్రిక విడుదల చేశారు. వర్గీకరణ వల్ల దళితుల ఐక్యతకు భంగం కలుగుతుందని అన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.