చీపురుపల్లిలో బంగారం, వెండి చోరీ

79చూసినవారు
చీపురుపల్లిలో బంగారం, వెండి చోరీ
చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో చోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్ దామోదర్ సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి పంచాయతీలోని కొత్త గవిడి వీధి, లెక్చరర్స్ కాలనీలలోని మూడు ఇళ్లల్లో దొంగలు చొరబడ్డారు. వాటిలో పెద్ది మహేశ్ ఇంటిలో 1350 గ్రాముల వెండి, 7 గ్రాముల బంగారం చోరీ అయిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్