మెరకముడిదాం మండల 104 సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు అందక పోవడంపై పి హెచ్ సి. వైద్యుడు డాక్టర్. అజిత్ బాబుకు మంగళవారం సిబ్బంది వినతిపత్రం అందించారు. 104 సేవలు 50 వేలు ఖర్చుతో ప్రభుత్వమే నిర్వహించాలని, 2020 తర్వాత విధుల్లో చేరిన డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాలని, అక్రమంగా వసూలు చేసిన పి.ఎఫ్ తిరిగి చెల్లించాలని, ఉద్యోగులకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు.