పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి

76చూసినవారు
పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు  దాడి
చీపురుపల్లి నియోజకవర్గం గల మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీసు స్టేషను పరిధిలోని బుధవారం పెద్ద పూతికవలస గ్రామ శివార్లలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న 22మందిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ సిఐ అశోక్ కుమార్, ఎస్సైలు సాగర్ బాబు, రామారావు ఆధ్వర్యంలో దాడి చేసి రూ. 1, 23, 860 లక్షల నగదును, 24 మొబైల్ ఫోన్లు, 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్