రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి అల్లాడ భాస్కరరావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని మంగళవారం కళా వెంకటరావు ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటు పడితే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.