గుర్ల మండలంలోని పలు గ్రామాల్లో అతిసారం ప్రబలి ఐదుగురు మరణించగా అందులో మంగళవారం ఒక్క రోజే నలుగురు మృతి చెందారు. తోండ్రంగి రామయ్యమ్మ, సారిక పెంటయ్య, పైడమ్మ, అప్పారావు మరణించారు. కొంతమందికి స్థానికంగా వైద్య సేవలు అందిస్తుండగా మరికొంతమందిని విజయనగరం, విశాఖ ఆసుపత్రులకు తరలించారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డయేరియా బాధితులను జిల్లా వైద్య అధికారి డాక్టర్ భాస్కరరావు పరామర్శించారు.