గంట్యాడ మండలంలోని నరవ, తామరపల్లి గ్రామ సచివాలయంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్ పీ సీ ఐ ప్రక్రియను గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇనాక్టివ్ లబ్దిదారుల జాభితా విడుదల చేసిన నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.