విజయనగరం జిల్లా గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఎస్సై కె. లక్ష్మణరావును ప్రపంచ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రపంచ మానవ హక్కుల మండలి సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శి సాయికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వారు చేస్తున్న సేవలకు గాను సత్కరించారు. రేవంత్, అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు సురేష్, సభ్యులు తాతినాయుడు, ప్రదీప్ సతీష్ పాల్గొన్నారు.