గజపతినగరం: యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

62చూసినవారు
యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గజపతినగరంలోని సాయి సిద్ధార్థ కళాశాల ఆవరణలో మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రారంభించారు. 10 కంపెనీలు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుగుణాకరరావు, కళాశాల కరస్పాండెంట్ శీరంరెడ్డి చంద్రశేఖర్, శ్రీధర్, శ్రీదేవి, మర్రాపు సురేష్, పావని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్