గంట్యాడ మండలంలోని రామవరం గంట్యాడ కొర్లాం గ్రామాల్లో జరుగుతున్న శానిటేషన్ ఇంటింటి సర్వేను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి, సర్వే సిబ్బందికి ఆయన పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ ఈవోపీఆర్డీ బానోజిరావు, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.