ప్రజా సమస్యలపై అధికారులు చొరవ చూపాలి

50చూసినవారు
ప్రజా సమస్యలపై అధికారులు చొరవ చూపాలి
ప్రజా సమస్యలపై అధికారులు చొరవ చూపాలని ఎంపీపీ చల్లా చల్లంనాయుడు కోరారు. గురువారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాలలో దీర్ఘకాలికంగా ఉన్న సామాజిక సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, తహసిల్దార్ రాజేశ్వరరావు, జడ్పిటిసి రాపాక సూర్యప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్