విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామాన్ని మంగళవారం బొబ్బిలి ఆర్డిఓ రామ్మోహనరావు సందర్శించారు. గ్రామంలో డయరియా కేసులు ఆరుకు చేరడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పరిసరాలను పరిశీలించడంతోపాటు పలు వీధులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ డయేరియా అదుపులో ఉందన్నారు.