పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: మల్లికార్జున్ రావు

68చూసినవారు
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: మల్లికార్జున్ రావు
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సామాజిక పింఛన్ మొత్తాన్ని సోమవారం నుంచి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కొమరాడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లికార్జున్ రావు శనివారం తెలిపారు. మండల వ్యాప్తంగా 20 గ్రామ సచివాలయాల్లో 8562 మంది సామాజిక పింఛన్దారులు ఉన్నట్లు ఆయన చెప్పారు. వీరందరికీ రూ 5, 79, 87, 500ల నగదు సచివాలయాల కార్యదర్శులకు అందించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్