గరుగుబిల్లి మండలంలోని పెద్దూరు, ఉద్దవోలు, పెదగుడబ, చిన్నగూడబ, గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వేలకు వేల రూపాయలు మదుపు పెట్టి మొక్కజొన్న, అపరాల సాగు చేశారు. అయితే ప్రకృతి కొన్నెర్ర చేయడంతో తమ ఆశలపైనీరు పోసినట్టయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పెద్దూరుకు చెందిన వంగపండు రామినాయుడు ఇటీవల మొక్కజొన్న సాగు చేయగా రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు.