మన్యం జిల్లాలోని ఎస్సి, ఎస్టి వర్గాల ప్రజలపై జరిగిన దాడుల కేసుల్లో బాధితులకు త్వరగా నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పి మాధవరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రతి కేసును పరిశీలించి వివరాలు అడిగారు.