కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ-జమ్ము గ్రామ పరిధిలోని పీసా గ్రామ సభల ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఉపాధ్యక్షుడుగా మండంగి సత్తి, కార్యదర్శిగా పువ్వల గణేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి ఎన్నికల అధికారి నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమల పాల్గొన్నారు.