నర్సీపట్నం.. స్పీకర్ ను ఘనంగా సత్కరించిన క్షత్రియ పరిషత్తు
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడునీ ఆదివారం నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అల్లూరి పేరును భోగాపురం విమానాశ్రయానికి, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నామకరణం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్కారం చేసినట్లు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గణపతి బంగార్రాజు తెలిపారు. .