నాతవరం మండలం తాండవ జంక్షన్ వద్ద వాహనం దగ్ధమైంది. ఖాళీ అట్టపెట్టెల లోడుతో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళుతుండగా ఆదివారం ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం విషయాన్ని స్థానికులు నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.