గొలుగొండ మండలం నాగాపురం సబ్ సెంటర్ లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆరా తీసారు. శుక్రవారం సబ్ సెంటర్ ను పరిశీలించిన అధికారులు గర్భిణీలు బాలింతలు కిషోర్ బాలికలకు నిర్వహించిన వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. డయరియా సోకకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.