నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని గోదాం ఉన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన గజపతినగరం నియోజకవర్గ ఈవీఎంలను సోమవారం తనిఖీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవీఎంను పరిశీలించాలని.. ఇటీవల ఈసీఐ ఆదేశించింది. ఈ మేరకు ఎంపిక చేసిన యంత్రాలను బెల్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అప్పలనరయ్య ఏజెంట్ సమక్షంలో చూశారు.