కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని సిపిఐ నెల్లిమర్ల మండల కన్వీనర్ మొయిద పాపారావు అన్నారు. ఆదివారం కొండ గుంపాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నిరసన తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం రూ. 672 కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో అదనపు భారాన్ని ప్రజలపై మోపారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.