పాలకొండ: అయ్యప్ప భక్తులకు ఉచిత అన్న ప్రసాదం కార్యక్రమాలు

76చూసినవారు
పాలకొండ: అయ్యప్ప భక్తులకు ఉచిత అన్న ప్రసాదం కార్యక్రమాలు
అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వచ్చే అయ్యప్ప దీక్షా దారులకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శబరిమలలో స్థానిక నీలక్కల్ సమీపంలో ఉచిత అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ మంగళవారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం పాలకొండలో కరపత్రాలను విడుదల చేశారు. అయ్యప్ప దీక్షాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్