అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేసిన సంఘటన పాలకొండ లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పాలకొండ స్థానిక నాగావళి సమీపంలో ఎక్సైజ్ సిఐ సూర్య కుమారి ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో కలివరపు వెంకటరమణ అనే వ్యక్తి తన బైక్ పై అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుండి 25 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.