పాలకొండ మండలంలోని బడ్డుమాసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ విజయ్ రాజ్ కుమార్ శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మెనూ ప్రకారం రోజువారీ ఆహారం ఇస్తున్నారా అని అడిగారు. అనంతరం వీరఘట్టంలోని పలు పాఠశాలలను సందర్శించారు.